ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రధాన సెంటర్లలో సందడి నెలకొన్నది. పూజలకు అవసరమైన సామాగ్రిని స్థానికులు కొనుగోలు చేశారు. ప్రజలు ఎక్కువ శాతం వాతావరణ కాలుష్యం నివారించడంలో భాగంగా మట్టి బొమ్మలను కొనుగోలు చేశారు. అలాగే ప్రతి వీధిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.