విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేరుకొని కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.పెండింగ్లో ఉన్న 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే ప్రగతి భవన్ గేట్ లు బద్దలు కొడతామని హెచ్చరించారు.