జిల్లాలో ఎరువులు కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నాలుగున్నరకు పెంటపాడు మండలం ప్రత్తిపాడు ప్రభుత్వ ఎరువుల గోదామును ఆయన తనిఖీ చేశారు. ఎరువుల సమస్యపై సీఎం ఆదేశాలతో ఎరువుల గోదాములను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్కు 21 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అన్నారు. ముందస్తు ప్రణాళికతో ఎటువంటి ఎరువుల కొరత లేదన్నారు. ఆర్డీవో, అధికారులు ఉన్నారు.