బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా ఘనవిజయాన్ని సాధించింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాకు 15కి పైగా కంపెనీలు హాజరయ్యాయి. సుమారు 300 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 108 మంది ఉద్యోగావకాశాలు దక్కించుకున్నారు.కళాశాల చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ “ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తును మెరుగుపరచుకోవాలి” అని సూచించారు. ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు.