ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డివిజన్ కమిటి సమావేశం బుధవారం డివిజన్ ప్రచార కార్యదర్శి పాయం సుధారాణి ఆధ్వర్యంలో చింతూరు లో నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు పాల్గొని మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ లో ఎక్కువ మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళు 10 నుండి 15 సం"రాలుగా పని చేస్తూనే ఉన్నారు సర్వీస్ పెరుగుతుంది కాని జీతం మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.