కలకడ ఉర్దూ ఉన్నత పాఠశాలకు దారి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవో జగదీష్ కు గురువారం హెచ్ ఎం శ్రీధర్ తో పాటు స్కూల్ చైర్మన్ సయ్యద్ భాష, వినతిపత్రం అందించారు.వారు తెలిపిన వివరాల ప్రకారం కలకడ మండల కేంద్రము గుర్రంకొండ రోడ్డులోని ఆదర్శ పాఠశాల పక్కనే గల మరో దారి గుండా జడ్పీ ఉర్దూ హైస్కూల్ కు విద్యార్థులు పాఠశాల ప్రారంభం నుంచి గత కొన్ని సం.గా వెలుతున్నారు. ఈ దారి పక్కన ఆదర్శ పాఠశాల విద్యార్థినుల హాస్టల్ ఇటీవల నిర్మించిన నేపథ్యంలో దారిని మూసేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఉర్దూ ఉన్నత పాఠశాలకు గల ఒక మార్గం మూసేస్తే పిల్లలు ఎలా పాఠశాలకు వెల్తారనీ దారి సమస్య పరిష్కరించాలన్నారు