వినాయక చవితి ఉత్సవాల అనంతరం జరిగే విగ్రహా నిమజ్జనాల దృష్ట్యా జిల్లాలో నిమజ్జనాలు అధికంగా జరిగే కొత్తపట్నం తీర ప్రాంతాలను శుక్రవారం జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో కలిసి సందర్శించి, నిమజ్జన ప్రదేశాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిమజ్జనం జరుగుతున్న ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యంగా నిమజ్జనల వద్ద డ్రోన్లు మరియు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచటం, భద్రతా దళాలు, స్పెషల్ బృందాలు కూడా విధుల్లో భాగంగా పాల్గొన్నాయి. తీరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చ