కోడుమూరు పట్టణంలో ప్రతి శనివారం జరిగే వారపు సంతలో భాగంగా గొర్రెలు, పొట్టేళ్ల విక్రయాలు రోడ్డు పక్కనే జరుగుతున్నాయి. స్థానిక రాముల వారి గుడి ముందు కర్నూలు రహదారిని అనుకుని క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. సంతకు ప్రతి శనివారం వివిధ గ్రామాల నుంచి కొనుగోలు, అమ్మకందారులు చేరుకుంటున్నారు. దీంతో ఆ ప్రదేశం అంతా సందడిగా ఉంటుంది. జనం రద్దీ మధ్య వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగడం, ట్రాఫిక్ ఇబ్బందులు పెరగడం తప్పడం లేదు. మరో అనువైన చోటు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.