దేశంలో మహిళలకు సురక్షితమైన నగరాల్లో విశాఖపట్నం టాప్‌లో నిలిచింది. ‘మహిళా భద్రతపై జాతీయ వార్షిక నివేదిక, సూచీ- 2025’లో ఈ వివరాలు గురువారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై నిర్వహించిన సర్వే ఆధారంగా దీన్ని రూపొందించారు. మహిళల విషయంలో జాతీయ భద్రతా స్కోరు 65 శాతంగా తేలిందని నివేదిక స్పష్టం చేసింది.