42 శాతం బీసీలకు రిజర్వేషన్ విషయంలో వోట్ చోరీ విషయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ బిజెపి గూండాలతో పిసిసి అధ్యక్షుడి దిష్టి బొమ్మ దగ్ధం చేపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు,సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం సాయంత్రం 8గంటలకు తెలంగాణ చౌక్ వద్ద బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బిజెపి పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు.