తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం వేటగిరీపాలెం గ్రామంలో కాలంగినది పోరంబోకు ప్రభుత్వ భూముల నుండి అక్రమంగా జెసిపిల సహాయంతో సోమవారం ఇస్తానుసారంగా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సూళ్లూరుపేట పరసర ప్రాంతాలకు ఒక ట్రాక్టర్ మట్టిని 1500 నుండి 2500 వరకు అక్రమరవాణా చేస్తూ దోచుకుంటున్న మట్టి మాఫియా పై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవంటూ వాపోయారు. దొరవారిసత్రం మండలంలోని రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు వీటిని అడ్డుకునే అధికారులు లేరా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకొని మా గ్రామానికి న్యాయం చేయవలెనని