ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం,కడెం, దస్తురాబాద్,ఖానాపూర్,పెంబి తదితర మండలాలలో బుధవారం ఉదయం నుండి మోస్తారు భారీ వర్షం కురుస్తుంది. గడచిన 24 గంటల్లో దస్తూరబాద్ మండలంలో 7.2 మిల్లీమీటర్లు, కడెంలో 6.2, పెంబిలో 4.2 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. రాబోయే 24 గంటలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలేవరు ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నందున చేపల వేటకని, పశువుల మేతకని ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.