సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట పట్టణంలోని హనుమాన్ చౌరస్తా వద్ద బుధవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు వేగంగా వచ్చి ఎక్సెల్ వాహనాన్ని ఢీకొని అనంతరం దుకాణ సముదాయాలపైకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న టిడిపి పార్టీ గద్దెకు ఢీకొనడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎక్సెల్ వాహనదారుడికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి ప్రమాదానికి కారణమైన కారు బొడ్మట్ పల్లి కి చెందిన మొగులయ్య కారుగా గుర్తించారు.