బొండపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధనాల సాయి గురువారం రాత్రి మృతి చెందినట్లు బొండపల్లి ఎస్ ఐ యుమహేష్ తెలియజేశారు. మక్కువ మండలం వెంకట బైరిపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తుండగా బోండపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపైరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం జరిగింది. క్షతగాత్రుల ముగ్గురిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు వీరిలో ధనాలు సాయి విజయనగరం జిల్లా ఆసుపత్రిలో మృతి చెందాడు.