.హిరేహాల్ మండలంలోని హిర్దేహాల్, జాజిరకల్లు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు బాబు ష్యూరిటి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ భోజరాజు నాయక్, మండల కన్వీనర్ రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎటువంటి సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు. జగన్ ప్రభుత్వంలోనే బాగుండేదని చెప్పారు.