హుజూరాబాద్: పట్టణం లోని మామిండ్లవాడ, గాంధీ నగర్, బుడిగే జంగాల కాలనీ,గ్యాస్ గోడౌన్ ఏరియా కాలనీలు ఇండ్లలో భారీగా నీరు చేరడం బియ్యం ఫర్నిచర్ తో సహా ఇంటి సామాన్లు నీట మునిగాయి. పట్టణంలో రంగ నాయకుల గుట్ట వద్ద చిలుక వాగు రోడ్డు పై నుండి ప్రవహిస్తుండడం తో హుజూరాబాద్ - కనుకులగిద్ద గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.వర్షం తగ్గిన నీటి ప్రవాహం మాత్రం తగ్గడం లేదు.దీంతో ఉదయం మున్సిపల్ అధికారులతో కలిసి ఆర్డిఓ రమేష్ బాబు నీట మునిగిన పలు కాలనీలను పరిశీలించి నష్టం అంచనా వేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.