నల్లగొండ జిల్లా: ధాన్యం కొనుగోళ్లు రైస్ మిల్లింగ్ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ ఆఫీసును తెలంగాణ ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా తెలంగాణ ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో కార్మికులు, హమాలీలు రైతులతో కలిసి సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దొడ్డు ధాన్యం కింటాకు 67 కేజీల బియ్యం లేవి చెల్లించే గత నేపథ్యం నుంచి ప్రస్తుతం సన్నధాన్యానికి కూడా కింటాకు 67 కేజీల బియ్యాన్ని చెల్లించమనడం ఆశాస్త్రీయమైనది అని అన్నారు.