పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని 26వ వార్డులో దీర్ఘకాలంగా పరిష్కారం కానీ మురుగు నీటి సమస్యను తెలివిగా మున్సిపల్ అధికారులు పరిష్కరించారు. పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గత మూడు సంవత్సరాలుగా ప్రధాన మురుగు కాలువలోని పైపు కల్వర్టులో పూడికలు పేరుకుపోవడంతో, ములుగు నీరు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్, డిఈ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ శనివారం ఆ కల్వర్టును పరిశీలించారు. చైన్ జేసిబి సాయంతో వైరు కట్టి చెత్తలను వెలుపలకి వచ్చేలా చేశారు. అంతేకాకుండా కాలువలో పేరుకుపోయిన వ్యర్ధాలు తొలగించారు.