చంద్రగ్రహణం కారణంగా ఘంటసాల మండలంలోని పలు దేవాలయాలను అర్చకులు మూసివేశారు. ఘంటసాలలోని బాల పార్వతీ సమేత జలదీశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారి దేవాలయం, ద్వారక శ్రీకృష్ణ ఆలయం, స్థానిక పెన్నేరమ్మ అమ్మవారి దేవాలయం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయబడ్డాయి. సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం దేవాలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి.