విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్గా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొలిమిగుండ్ల ప్రభుత్వ వైద్యులు డా. హరిచరణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాలలో జ్వరాల పట్ల వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు విష జ్వరాల పట్ల అవగాహన కల్పించి నేను చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. మందులు పంపిణీ చేస్తున్నామన్నారు.