రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో డబుల్ ఓటర్లు ఉండకుండా చర్యలు చేపడతామని, ఒకరు ఒకటి కంటే ఎక్కువ కేంద్రాల్లో ఓటరుగా ఉన్నట్లయితే వెంటనే తొలగిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 4,49,302 మంది ఓటర్లు ఉన్నారని, వారి సౌకర్యార్థం 892 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.