అల్లూరి జిల్లా ముంచంగిపుట్టి మండలం డుడుమ జలపాతం లో నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో తన స్నేహితుల ముందే పోయి యువకుడు కొట్టుకుపోయిన వీడియో ఆదివారం ఉదయం పదిగంటల సమయంలో పలు వాట్సాప్ గ్రూప్ లలో వైరల్ అయింది. బరంపురం నుండి వచ్చిన బృందం వీడియో తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా జల విద్యుత్ కేంద్రం నుండి నీటిని విడుదల చేయడంతో వీడియో తీస్తున్న సాగర్ అనే యువకుడు తన స్నేహితులు ముందే కొట్టుకుపోయాడు. కొట్టుకుపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో గాలింపు కష్టతరమని అధికారులు తెలియజేశారు.