నల్లగొండ జిల్లా: 565 జాతీయ రహదారి నిర్మాణ పనులు పూర్తి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే పనులు ప్రారంభించాలని 565 జాతీయ రహదారి బైపాస్ నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం ఊటుకూరు వెంకటరెడ్డి శనివారం డిమాండ్ చేశారు. శనివారం 565 జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.