కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడితే కఠినంగా శిక్షలు ఉంటాయని ఏటూరునాగారం ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ను ఉపేక్షించేది లేదని, విద్యార్థులు సోదర భావంతో మెలగాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.