కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా బెంగళూరు వైపు వెళ్తున్న సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు శుక్రవారం రాత్రి జెండా ఊపి రైలు ప్రారంభించారు. సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతిరోజు వస్తుందని బెంగళూరు, తిరుపతి, దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లేందుకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. రైలు మొట్టమొదటిసారిగా రావడంతో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలను జరుపుకున్నారు,