ఖైరతాబాద్ మహాగణపతిని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 71 ఏళ్ల క్రితం ఒక అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఈరోజు 69 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడని తెలిపారు. దేశంలో ఖైరతాబాద్ గణేష్ కు ఎంతో విశిష్టత ఉందని అన్నారు. ఈసారి నగరంలో 1 లక్ష 40 వేల గణేష్ విగ్రహాలు ప్రతిష్టించారని అన్నారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించామని తెలిపారు.