శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం మైలసముద్రం గ్రామానికి దగ్గరలోని మలుపు వద్ద ఆటోను వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. బుక్కపట్నం మండలం బుచ్చయ్య గారి పల్లి గ్రామానికి చెందిన బోయ గోపాల్ ఆటో లో చెన్నేకొత్తపల్లి మండలం వెంకటం పల్లి గ్రామానికి వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం వెళుతుండగా ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మీనరసమ్మ, లక్ష్మమ్మ,ఆటో డ్రైవర్ గోపాల్, గంగమ్మ,మీనమ్మ, వెంకటమ్మ, లక్ష్మీదేవి రాజేశ్వరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 సాయంతో పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు