శుక్రవారం మధ్యాహ్నం జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి కోనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీగా వస్తున్న వరదతో ప్రాజెక్టులోకి 3.60 లక్షల క్యూసెక్కుల ప్రాజెక్టులో చేరుతోంది. దీంతో అధికారులు 38 గేట్లు ఎత్తి 3.64 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 317 మీటర్ల వద్ద కొనసాగుతోంది. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.