పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతున్న గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపరాదని ఈమేరకు జరుగుతున్న ప్రయత్నాలు విరమించుకోవాలని అంబేడ్కర్ ఇండియా మిషన్ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం రెండో రోజు గణపవరంలో అంబేడ్కర్ ఇండియా మిషన్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. ప్రజల కోరిక మేరకు గతంలో ఏలూరు జిల్లా నుంచి విడదీసి పశ్చిమగోదావరి జిల్లాలో గణపవరం మండలాన్ని కలిపారని దీనిని కొనసాగించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఏఐఎం జిల్లా ఇన్చార్జి బండి మధు, గణపవరం మండల కన్వీనర్ బళ్లారపు అశోక్ పాల్గొన్నారు.