నిర్మల్ పట్టణంలో రాత్రి జరిగిన వినాయక నిమజ్జన శోభాయాత్రను ఎస్పీ జానకి షర్మిల స్వయంగా పర్యవేక్షించారు. ప్రార్థనా స్థలాలు, మందిరాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్ వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు, డ్రోన్లతో భద్రతను పర్యవేక్షించారు. శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.