ములుగు మండలం జంగాలపల్లి వద్ద యూరియా కోసం రైతులు నేడు గురువారం రోజున ఉదయం 9 గంటలకు బారులుదీరారు. పీఏసీఎస్ కేంద్రం వద్ద ఉదయాన్నే వందల సంఖ్యలో రైతులు రెండువైపులా క్యూలో నిలుచున్నారు. యూరియా దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. కాగా టోకెన్లు తీసుకున్న రైతులకు యూరియా అందజేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఉదయాన్నే రైతులు పెద్ద ఎత్తున పీఏసీఎస్ కేంద్రానికి చేరుకోగా, ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.