వికారాబాద్ జిల్లాలో నవాబ్ పేట్ మండల పరిధిలో నుంచి వెళ్తున్న త్రిబుల్ ఆర్ రోడ్డుకు సంబంధించిన పాత అలైన్మెంట్ ప్రకారమే భూ సేకరణ జరపాలని కోరుతూ శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను, మంత్రి శ్రీధర్ బాబును భూములు కోల్పోతున్న రైతులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు గల భూములనుంచి త్రిబుల్ ఆర్ పోతే రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటారని రైతుల కోసం పాత అలైన్మెంట్ ప్రకారమే భూసేకరణ జరపాలని కోరారు.