ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు గోపాల్పేట మండలం చెన్నూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభితో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను గ్రామ సభలో ప్రారంభించారు. ప్రారంభానికి ముందు గ్రామ ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వీడియో ద్వారా వినిపించారు. అనంతరం పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పార్టీలకతీతంగా, అత్యంత పారదర్శకంగా నిజమైన ప్రతి లబ్ధిదారునికి పథకం ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు