యాడికిలో వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. దసరా మహోత్సవాలలో భాగంగా 5వ రోజు శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గజలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. హోమ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి చూపారు.