శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కాలసముద్రం వద్ద ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగాయి. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ వంట చేస్తున్న సమయంలో సిలిండర్ పేలడంతోనే మంటలు చెలరేగి లారీ దగ్ధమైనట్టుగా స్థానికులు తెలిపారు. మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డాడు.