శుక్రవారం ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ సమావేశం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో సైబర్ మరియు ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఒక ప్రత్యేక విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు ఈ సమావేశంలో 20 రాష్ట్రాల నుంచి ఉన్నత పోలీసు అధికారులు పాల్గొన్నారు. పెరుగుతున్న ఆర్థిక మోసాలపై మరియు సైబర్ నేరాలపై సవివరంగా చర్చించారు అలాగే సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి వాళ్ళు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని నిర్ణయించారు.