సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి తెలిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం ఉదయం పలు గ్రామాలకు వెళ్లే లో లెవెల్ వంతెనల మీదుగా వరద నీరు ప్రవహిస్తుంది జహీరాబాద్ మండలంలోని. రాయిపల్లి(డి), బూచినెల్లి-ఘనపూర్, జరా సంఘ మండలంలోని ఎల్గోయి-రేజింతల్, న్యాల్కల్ మండలంలోని చాల్కీ, జహీరాబాద్ మండలంలోని అల్గోల్-ఎల్గోయి, ప్యాలవరం వాగులు పొంగడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందిగా మారింది.