తిర్యాణి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మికంగా సందర్శించారు. ఆయన మాట్లాడుతూ..సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. పౌష్టిక ఆహారం ఆవశ్యకతపై ప్రజలకు వివరించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు.