చిత్తూరు: పాఠశాల ఆవరణంలో మద్యం బాటిళ్లు పవిత్రమైన విద్యాలయాలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు కజూర్ ప్రైమరీ స్కూల్లో ఆదివారం కొందరు మందు తాగి ఖాళీ బాటిళ్లు, తినుబండారాలను అక్కడే వదిలేసి వెళ్లారని స్థానికులు తెలిపారు. సోమవారం ఉదయం వీటిని చూసిన విద్యార్థులు, టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.