అనంతపురం నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బ్రాహ్మణ వీధిలో మంజునాథ్ అనే వ్యక్తి చేసిన వ్యాపారంలో తీవ్రమైన నష్టం వాటిల్లడంతో తీవ్రమైన మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వ్యాపారం సాగక 8 లక్షల వరకు అప్పు రావడంతో తీవ్ర మనస్తాపం గురయ్యాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.