హైదరాబాద్ నగరవ్యాప్తంగా జరిగే వినాయక నిమజ్జనాల ఏర్పాట్లపై కలెక్టర్ హరిచందన సిపి సివి ఆనంద్ అధికారులతో కలిసి రూట్ మ్యాప్ ను పరిశీలిస్తున్నారు. వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా రూట్ మ్యాప్ ను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశీలనలో భాగంగా చార్మినార్ వద్ద రూట్ మ్యాప్ ను కలెక్టర్ హరిచందనతో కలిసి బుధవారం మధ్యాహ్నం సిపి సివి ఆనంద్ పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లపై పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆర్వి కర్ణన్ పాల్గొన్నారు.