నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ప్రజలు అనవసరంగా ఇండ్ల నుండి బయటకు రావద్దని, మరింత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వర్ణ, కడెం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.