సత్తెనపల్లిలోని ఓ రెసిడెన్సీ వద్ద శనివారం అర్ధరాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 2.45 లక్షల నగదు, 21 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.