జనసేనను బలోపేతం చేసేందుకే విశాఖలో ఈనెల 30న జరగనున్న సేనతో సేనాని బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి చెప్పారు. బొబ్బిలి జనసేన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేసేందుకు విశాఖలో అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, ముఖ్యనాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ స్థితిగతులను తెలుసుకుంటారని చెప్పారు. సమావేశానికి హాజరు కావాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.