బుధవారం వినాయక చవితి సందర్భంగా సెలవు కావడంతో వినాయక చవితి పండుగను ముగించుకొని సాయంత్రం ఆర్కే బీచ్లో చేత తీరుద్దామని బీచ్ రోడ్డు కి వచ్చిన ప్రతి ఒక్కరికి నిరాశ ఎదురైంది. వాహనాలు అధికంగా వచ్చి చేరటంతో బీచ్ రోడ్డు మొత్తం ట్రాఫిక్ తో నిండిపోయింది. గంటలు కొద్ది వాహన చేతకులు ట్రాఫిక్ లో నిలిచిపోయారు. బీచ్ లో సైతం అలలు అధికంగా ఉండటంతో బీచ్ లోకి వెళ్లలేదు అలాగే ఇంటికి వెళ్లి పోదామని తిరిగి వెళ్ళడానికి కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో గంటలు కొద్ది సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ సిబ్బంది ప్రతిష్ట చర్యలు చేపట్టాలని వాహనచోదకులు అసహనం వ్యక్తం చేశారు.