గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని SP శబరీశ్ అన్నారు. మంగపేట పోలీస్ స్టేషన్ ను బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ కు బానిసలైన వారిని రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించి, కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. సైబర్ మోసగాళ్ల బారిన పడి ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ శ్రీనివాస్, ఎస్సై సూరి పాల్గొన్నారు.