హోళగుంద మండలం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి గ్రీవెన్స్ సందర్భంగా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను స్వీకరిస్తున్న సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. అదేవిధంగా ఎల్లార్తిలో సచివాలయాన్ని తనిఖీ చేయడం జరిగిందని శుక్రవారం సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ తిమ్మక్క, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మనాభ రెడ్డి, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ షఫీ ఉల్లా, డిప్యూటీ డిఎంహెచ్వో సత్యవతి, డిప్యూటీ డీఈవో వెంకటరమణ రెడ్డి, తహశీల్దార్ నిజాముద్దీన్, ఎంపీడీవో విజయ లలిత సంబంధిత అధికారులు పాల్గొన్నారు.