కృష్ణాజిల్లా లోని హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హంసలదీవి బీచ్ గేట్లను మూసివేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగమణి తెలిపారు. తెల్లవారుజామునుండి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటం, భారీ వర్షాలు కురుస్తున్న కారణంతో పాలకాయతిప్ప వద్ద ఉన్న అటవీ శాఖకు చెందిన హంసలదీవి బీచ్ గేట్ను 2 రోజుల పాటు మూసివేస్తున్నామని బుధవారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో ఆమె పేర్కొన్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి, బీచ్్క రావద్దని ఆమె సూచించారు.