గోవిందరావుపేట (మం) గాంధీనగర్ గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో చిన్నపిల్లలకు ఇచ్చిన కోడిగుడ్లలో కుళ్ళిన కోడిగుడ్లు ప్రత్యక్షమయ్యాయి. అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి నెల రోజులకు సరిపడా కోడిగుడ్లను లబ్ధిదారులకు అందజేశారు. అయితే వాటిలో నేడు శుక్రవారం రోజున ఉదయం 8 గంటలకు కుళ్ళిన కోడిగుడ్లు కనిపించాయి. మరి కొన్నింటిని ఉడకబెట్టి చూడగా అవి కూడా పాడైపోయి ఉన్నాయి. ఇలా కుళ్ళిన కుర్రోడు గుడ్లను పంపిణీ చేయడం వల్ల గర్భిణీ మహిళలు, బాలింతలు, చిన్నపిల్లల ఆరోగ్యం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. వీటిపై అధికారులు దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.