పాణ్యం మండల పరిధిలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నాగలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.1.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ పనులను ప్రారంభించారు. రానున్న రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగలింగేశ్వర స్వామి ఆలయం పనులు పూర్తయితే నూతన శోభను సంతరించుకొనుంది.